గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈరోజు నుంచి లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చాయి. పట్టణంలో హోల్ సేల్ దుకాణాలు ఉదయం 6 గంటలనుంచి 11 గంటలవరకు, చిల్లర దుకాణాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు, ఎరువులు, వ్యవసాయ దుకాణాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు తెరుచుకోవచ్చని సబ్ కలెక్టర్ శ్రీవాస్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో నిత్యావసరాలు, మందుల దుకాణాలకు తప్ప వేరే షాపులు తెరవకూడదన్నారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
నరసరావుపేటలో నేటి నుంచి లాక్ డౌన్ సడలింపులు - నరసరావుపేటలో లాక్ డౌన్ సడలింపులు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈరోజు నుంచి లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చాయి. దుకాణ యజమానులు, వినియోగదారులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సబ్ కలెక్టర్ చెప్పారు.
![నరసరావుపేటలో నేటి నుంచి లాక్ డౌన్ సడలింపులు free from lockdown in narasaraopet guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8560047-808-8560047-1598427496026.jpg)
నరసరావుపేటలో నేటి నుంచి లాక్ డౌన్ సడలింపులు