జీజీహెచ్, రెడ్ క్రాస్ అధికారులతోపాటు మద్య నిషేధ ప్రచార కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో... తలసేమియా రోగులకు జీజీహెచ్లో ఉచిత రక్తమార్పిడి ప్రక్రియ చేపట్టనున్నారు. కార్యక్రమ లక్ష్యాలను రాష్ట్ర మద్య నిషేధ ప్రచార కమిటీ అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు రామచంద్రరాజు వివరించారు.
ఇంటర్ నుంచి పీజీ, మెడిసిన్, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల నుంచి రక్తదానం కార్యక్రమాల ద్వారా రక్తాన్ని సేకరించి తలసేమియా వ్యాధిగ్రస్థులకు అందించనున్నామని లక్ష్మణరెడ్డి చెప్పారు. 0863-2215656, 91008 19588 నంబర్లకు ఫోన్ చేసి తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.