ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగాల పేరుతో వల... లక్షల్లో టోకరా

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు యువకుల వద్ద రూ.లక్షలు వసూలు చేశారు. నియామక పత్రాలు తీసుకుని వెళ్లే వరకు అవి నకిలీవని ఆ యువకులు గుర్తించలేకపోయారు. చివరికి తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

Fraud to give jobs in Guntur district
ఉద్యోగాల పేరుతో వల... లక్షల్లో టోకరా

By

Published : May 22, 2021, 11:27 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్​లో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై... ఆస్పత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరుమాళ్లపల్లి నరసింహారావు, శ్రీనివాసరావు అనే వ్యక్తుల నుంచి సత్తెనపల్లికి చెందిన పొత్తులూరి దాస్, చంద్రవర్మ.. ఎయిమ్స్​లో ప్రమోటర్స్​గా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రూ. 5 లక్షలు తీసుకున్నారు.

ఉద్యోగాల పేరుతో మోసం.. పోలీసులకు బాధితుల ఫిర్యాదు

నియామక పత్రాలను సైతం ఇచ్చారు. వాటిని తీసుకొని ఎయిమ్స్ వెళ్లిన నరసింహారావు, శ్రీనివాసరావు.. అధికారులు ఇచ్చిన స్పందనతో ఖంగు తిన్నారు. అవి నకిలీ నియామక పత్రాలని అధికారులు వీరికి చెప్పారు. తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు.. ఎయిమ్స్ అధికారులతో కలిసి మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details