గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్పందన కార్యక్రమంలో ఒక విద్యార్థిని... తనను మోసం చేసి 2 లక్షల నగదు, 40 వేలు విలువ చేసే బంగారం తీసుకున్నారని ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల మేరకు నరసరావుపేట రెండో పట్టణ పోలీసులు విచారణ చేపట్టి ముగ్గురు యువకులపై చీటింగ్, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు.
ప్రేమపేరుతో మోసం.. రూ.2లక్షలు తీసుకున్నాడని ఫిర్యాదు - ప్రేమ పేరుతో మోసం.. రూ. 2లక్షల తీసుకున్నాడని ఫిర్యాదు
ప్రేమపేరుతో తనను నమ్మించి డబ్బులు వసూలు చేశారంటూ ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది. తన వద్ద సుమారు 2 లక్షల నగదు, 40 వేలు ఖరీదు చేసే బంగారం తీసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రేమ పేరుతో మోసం.. రూ. 2లక్షల తీసుకున్నాడని ఫిర్యాదు
ఆ ముగ్గురిలో కీలక నిందితుడు జంగాలపాడుకు చెందిన పులుకూరి శివానంద్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతనికి సహకారించిన హెడ్ కానిస్టేబుల్స్ అప్పలనాయుడు, శ్రీనుని పోలీసులు విచారిస్తున్నట్లు సీఐ పి.కృష్ణయ్య తెలిపారు. శివానంద్కు మరి కొందరి సహకరించినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. పూర్తి విచారణ చేపట్టి త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తామని సీఐ కృష్ణయ్య చెప్పారు.
ఇదీ చదవండి రమేశ్ ఆసుపత్రికి అచ్చెన్నాయుడు.. పోలీసుల భారీ బందోబస్తు