ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరి చేనేత సొసైటీలో అక్రమాలు... 17 మందిపై కేసు - guntur district crime news

మంగళగిరి చేనేత సహకార సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ... అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు భూ అక్రమాలకు పాల్పడ్డ 17 మందిపై కేసు నమోదు చేశారు.

fraud in mangalagiri handloom society in guntur district
మంగళగిరి చేనేత సొసైటీలో అక్రమాలు

By

Published : Feb 28, 2021, 5:29 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత సహకార సొసైటీలో జరిగిన అక్రమాలపై పోలీసులకు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారు. మంగళగిరి చేనేత కాలనీలోని ద మంగళగిరి వీవర్స్ కో-ఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సొసైటీ లిమిటెడ్​లో జరిగిన అక్రమాలపై చేనేత శాఖ విచారణ చేపట్టింది. 2014 నుంచి 2019 వరకు సొసైటీ ఆధీనంలో ఉన్న భూమిని అనుమతి లేకుండా విక్రయాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరిపి భూ అక్రమాలకు పాల్పడ్డ 17 మందిపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details