ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజ్​భవన్ సిబ్బంది నలుగురికి కరోనా' - ఏపీ రాజ్​భవన్ సిబ్బందికి కరోనా

రాజ్భవన్లో సిబ్బందికి కరోనా సోకిందన్న వార్తలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. నలుగురికి పాజిటివ్గా తేలిందని వెల్లడించారు. గవర్నర్కు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని తెలిపారు.

four rajbhavan staff tested corona positive
four rajbhavan staff tested corona positive

By

Published : Apr 28, 2020, 7:41 PM IST

Updated : Apr 28, 2020, 7:49 PM IST

మీడియాతో జవహర్ రెడ్డి

రాజ్‌భవన్ సిబ్బందిలో నలుగురికి కరోనా సోకిందని… రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి వెల్లడించారు. బాధితులు సెక్యూరిటీ ఆఫీసర్, ఒక స్టాఫ్​నర్స్, ఇద్దరు అటెండర్లని ఆయన తెలిపారు. గవర్నర్‌కు కూడా పరీక్షలు చేశామని... నెగెటివ్ వచ్చిందని జవహర్‌రెడ్డి చెప్పారు. మిగతా సిబ్బందికి పరీక్షలు చేశామని వారిలో ఎవరికీ పాజిటివ్ రాలేదని జవహర్ వివరించారు. మరోవైపు రాష్ట్రంలో ఆరోగ్య శాఖ సిబ్బంది 31మంది, వైద్యులు 12 మంది, నర్సింగ్ స్టాఫ్ 12 మంది, ఫార్మసీ సిబ్బంది 2, పారిశుద్ధ్య సిబ్బంది 5 మంది కరోనా బారినపడ్డారని ఆయన వివరించారు.

Last Updated : Apr 28, 2020, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details