గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. వేలూరుకు చెందిన ఓ కుటుంబం.. తమ 6నెలల పాపకు జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం చిలకలూరిపేటకు ఆటోలో వెళ్తున్నారు.
ఈ క్రమంలో గణపవరం వద్ద ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ బొంతా మోషేతో సహా మరో ఇద్దరు తీవ్రం గాయపడగా.. పాపకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో తరలించారు.