గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న లారీని వెనుకవైపు కారు ఢీకొట్టింది. కారు సగ భాగం లారీలో ఇరుక్కుంది.
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులను కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.