గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి వద్ద గురువారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు, పెదవడ్లపూడికి చెందిన వ్యక్తులు మంగళగిరి నుంచి ఆటోలో వెళ్తుండగా పాల వ్యాను ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న వెంకయ్య, పవన్ అక్కడికక్కడే మృతి చెందగా... ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే నాగేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ తెల్లవారు జామున చనిపోయాడు.
గుంటూరులో రోడ్డు ప్రమాదం-నలుగురు మృతి - గుంటూరు రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
గుంటూరు జిల్లాలోని పెదవడ్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మంగళగిరి నుంచి రేవేంద్రపాడు వెళ్తున్న ఆటోను పాల వ్యాను ఢీ కొట్టింది.

గుంటూరులో రోడ్డు ప్రమాదం