తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో డెంగీతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించిన ఘటన మరువకముందే ఆదే కుటుంబానికి చెందిన మరో మహిళ సోనా ఇవాళ ప్రాణాలు విడిచారు. సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో డెంగీతో పోరాడి ఓడిపోయారు. రెండు వారాల్లోనే నలుగురు కుటుంబ సభ్యులు మరణించడం అందరినీ కలచివేసింది. నిన్న మధ్యాహ్నమే సోనా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. బిడ్డను కూడా ప్రత్యేక వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి - తెలంగాణలో డెంగీ వార్తలు
తెలంగాణ మంచిర్యాలలో ఓ కుటుంబాన్ని డెంగీ మహమ్మారి పట్టి పీడిస్తోంది. కేవలం రెండువారాల వ్యవధిలో ఏకంగా నలుగురిని పొట్టన పెట్టుకుంది.
తెలంగాణలో డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి
మంచిర్యాలలోని శ్రీశ్రీనగర్ నివాసముంటున్న గట్టు రాజు డెంగీతో ఈనెల 15న మరణించారు. ఆయన మరణించిన ఐదో రోజునే రాజు తాతయ్య లింగయ్య డెంగీ బారిన పడి తుదిశ్వాస విడిచారు. రాజు- సోనాల ఐదేళ్ల కుమార్తె శ్రీ వైష్ణవి కూడా డెంగీ మహమ్మారి సోకి దీపావళి రోజున ప్రాణాలు విడిచింది. ఇవాళ సోనా కూడా మరణించారు. ఇలా ఈ కుటుంబంలో నలుగురిని డెంగీ మింగేసింది.
ఇవీచూడండి: ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన పోస్ట్మాస్టర్ అరెస్ట్