వరుణుడి రాకతో రైతన్న ఆనందం
వరుణుడి రాకతో.. రైతన్నల ఆనందం - etvbharat
రెండు రోజులు కురిసిన వర్షం రైతుల కళ్లల్లో ఆనందం నింపింది. ఇప్పటికే పత్తి విత్తనాలు వేసిన రైతులు మరో వారం రోజులు వర్షాలు కురిస్తే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

rain
వర్షాకాలం పంటలకు రైతులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గుంటూరులో రైతులు దుక్కులు దున్ని చదును చేసుకున్నారు. ఇక విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. వర్షాలు మంచిగా కురిస్తే పత్తి విత్తనాలు నాటాలని భావిస్తున్నారు. తొలకరి ఆశాజనకంగా ఉండటంతో రైతన్నలు ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు.