ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెలుగు భాష జాతికి ఆత్మ లాంటిది... దాన్ని చంపటం దురదృష్టకరం' - మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వార్తలు

తెలుగు భాషను చంపే ప్రయత్నం జరగడం దురదృష్టకరమని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పండితులకు, సాహితీ వేత్తలకు సన్మానం జరగడం అనుమానమేనని అన్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/28-November-2019/5201854_703_5201854_1574925461988.png
గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడుతున్నా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్

By

Published : Nov 28, 2019, 1:17 PM IST

భాష అనేది జాతికి ఆత్మ లాంటిది...దాన్ని చంపటం దురదృష్టకరం

తెలుగు భాష అనేది జాతికి ఆత్మ లాంటిది అని అలాంటి ఆత్మను చంపే ప్రయత్నం జరగడం దురదృష్టకరమని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణ శత జయంతి ఉత్సవాల్లో మండలి బుద్ధప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తెలుగు సాహితీ వేత్తలకు, పండితులకు సన్మాన సత్కారాలు చేస్తారో.. లేదో అనే అనుమానం కలుగుతుందని రామకృష్ణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details