ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

EX MLA passed away: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి మృతి - మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి తాజా సమాచారం

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో ఇవాళ ఉదయం మరణించినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

Former MLA Pinnelli Lakshmareddy
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి

By

Published : Sep 24, 2021, 9:45 AM IST

Updated : Sep 24, 2021, 11:03 PM IST

గుంటూరు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉండటంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఆయనను మాచర్లకు తీసుకు వచ్చారు. తిరిగి అనారోగ్యం దెబ్బతినటంతో.. ఈ ఉదయం లక్ష్మారెడ్డి స్వగృహంలో మరణించారు. ఆయన మృతదేహానికి పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రస్తుత ప్రభుత్వ విప్,స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి లక్ష్మారెడ్డి స్వయానా పెదనాన్న. లక్ష్మారెడ్డి 2004లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేసి గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్​కు సన్నిహితునిగా మెలిగారు. లక్ష్మారెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు మాచర్లకు రానున్నారు.

Last Updated : Sep 24, 2021, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details