ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలపై నరసరావుపేట తెదేపా పార్లమెంటరీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుగొండలో సీపీఐ, తెదేపా కలసి పోటీ చేస్తోందని.. భాజపా అందులో లేదని విమర్శించారు. ఎవరితో పొత్తు అనే విషయం కూడా తెలియని నువ్వు ఎమ్మెల్యే ఎలా అయ్యావని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకొని ఓట్లు దండుకున్నది నీవు కాదా అని నిలదీశారు.
'పొత్తు అనే విషయం కూడా తెలియని నువ్వు ఎమ్మెల్యే ఎలా అయ్యావు?'
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరితో పొత్తు అనే విషయం కూడా తెలియని నువ్వు ఎమ్మెల్యే ఎలా అయ్యావు అని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకొని ఓట్లు దండుకున్నది నీవు కాదా అని నిలదీశారు.
2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాలనలో నాడు ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు హయాంలో సీపీఐ భూపోరాటంలో భాగంగా మసీదు మాన్యంని ఆక్రమించారు. మీ వైఎస్ఆర్ పాలనలో జరిగిన ఈ విషయాన్ని మాకు అంటకట్టడం సమంజసం కాదన్నారు. వక్ఫ్ బోర్డు భూములు నాడు రియల్ ఎస్టేట్ చేతుల్లోకి వెళితే చోద్యం చూసిన మీరు.. నేడు ఎన్నికల స్వార్థ ప్రయోజనాల కోసం బొల్లా ముస్లిం సోదరులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ భూములు ప్రభుత్వానికి ఇప్పించి.. ఆ నిధులతో వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని పెంచి ముస్లింలకు న్యాయం చేయాలన్నారు. మీ బెదిరింపు ధోరణికి ప్రజలు మౌనంగా సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ఇదీ చదవండి