అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ... గుంటూరులో ఐకాస ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు మద్దతు పలికారు. జై అమరావతి, జైజై అమరావతి... ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నియంతృత్వ ధోరణితో... రాష్ట్ర ప్రజలు రోడ్డున పడ్డారని ఆనంద్‌బాబు అన్నారు. శాసనమండలి రద్దు సీఎం పతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఐకాస దీక్షకు మాజీ మంత్రుల మద్దతు - former ministers prathipati pullarao support jac strike
గుంటూరులో ఐకాస ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షకు మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు మద్దతు పలికారు.
ఐకాస దీక్షకు మద్దతు పలికిన మాజీ మంత్రులు
తండ్రిని అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన జగన్ తండ్రి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఇకనైనా ముఖ్యమంత్రి నియంత పోకడలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'రాజధానిగా అమరావతి సాధనే.. మా ఏకైక లక్ష్యం'