గుంటూరు జిల్లా తెనాలిలో బ్రాహ్మణ కుటుంబంపై వైకాపా నేత, మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ భర్త ఎలవర్తి సాంబశివరావు దాడి చేశారు. స్థలం వివాద విషయంలో చంద్రమోహన్‌పై కత్తి, కర్రలతో దాడి చేశారు. చంద్రమోహన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడుని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్.. ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు.
వైకాపా నేత దాడిలో గాయపడ్డిన వ్యక్తిని పరామర్శించిన మాజీ మంత్రి - తెనాలి వార్తలు
గుంటూరు జిల్లా తెనాలిలో ... స్థలం వివాదంలో గాయపడి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రమోహన్‌ని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
![వైకాపా నేత దాడిలో గాయపడ్డిన వ్యక్తిని పరామర్శించిన మాజీ మంత్రి rajendra prasad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10087141-1072-10087141-1609520635613.jpg)
వైకాపా నేత దాడిలో గాయపడ్డ వ్యక్తిని పరామర్శించిన మాజీ మంత్రి