మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు... ప్రధాని మోదీతో విభేదించి తప్పు చేశారని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. మళ్లీ తెదేపా, భాజపా, జనసేన కలుస్తాయన్నారు. రాజధాని రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... పులివెందులలో రాజధాని పెట్టుకోవాలే కానీ మూడు రాజధానులు తగదన్నారు.
'మళ్లీ తెదేపా.. భాజపా.. జనసేన కలుస్తాయి' - former minister rayapati sambasivarao rajadhani visit news
ప్రధాని మోదీతో విభేదించి చంద్రబాబు తప్పు చేశారని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. మళ్లీ తెదేపా, భాజపా, జనసేన కలుస్తాయని వ్యాఖ్యానించారు.
మాట్లాడుతున్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు