ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కక్షపూరిత రాజకీయాలు మంచిది కాదు: ప్రత్తిపాటి పుల్లారావు - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వార్తలు

వైకాపా ప్రభుత్వం ఒక సామాజిక వర్గం వారిపైనే కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

former minister prathipati pullarao fires on ycp
వైకాపాపై మండిపడ్డ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

By

Published : Feb 10, 2020, 4:46 PM IST

వైకాపాపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు

వైకాపా ప్రభుత్వం ఒక సామాజిక వర్గం వారిపైనే కక్ష సాధిస్తోందని... మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కూడా అదే కోవలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గుంటూరులో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి పోస్టింగులు ఇవ్వకుండా... వేతనాలు, ఇతర లబ్ది చేకూరకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో బాగా పనిచేసిన వారిని వైకాపా లక్ష్యంగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సైతం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కక్ష పూరిత రాజకీయాలు మంచివి కాదని ప్రభుత్వానికి హితవు పలికారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details