సుప్రీంకోర్టులో మాజీమంత్రి నారాయణకు ఊరట - ఇన్నర్ రింగ్‌రోడ్డు అక్రమాలపై సుప్రీంకోర్టు
15:04 November 07
నారాయణ ముందస్తు బెయిల్ రద్దుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
Supreme Court: సుప్రీంకోర్టులో ఏపీ మాజీమంత్రి నారాయణకు ఊరట లభించింది. నారాయణ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ నారాయణపై నమోదైన కేసులో హైకోర్టు.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రింగ్‌రోడ్ అలైన్‌మెంట్‌లో, భూసేకరణలో మార్పులు చేశారని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణ సంస్థలకు నారాయణ సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు చెప్పినా హైకోర్టు పట్టించుకోలేదన్నారు. దర్యాప్తునకు సహకరించకపోతే సంబంధిత కోర్టుకు వెళ్లవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతీకార రాజకీయాల్లోకి కోర్టులను లాగవద్దని ధర్మాసనం హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం విచారణ జరిపింది.
ఇవీ చదవండి: