గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో కరకట్ట వద్ద జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులను మాజీ మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. భారీ ఎత్తున ఇసుక డంపింగ్ చేయటం వల్ల కరకట్ట మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇష్టం వచ్చినట్లు ఇసుక డంప్ చేయడం వల్ల ఇప్పటికే కరకట్ట ప్రాంతం బలహీన పడిందన్నారు. రాబోయే వర్షాకాలంలో నీళ్లు నిలిచిపోతే మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. అక్రమంగా ఇసుక నిల్వ చేసి కరకట్ట బలహీన పడేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. ఈ చర్య రాజద్రోహం కిందకి వస్తుందని ఆయన అన్నారు.