పంచాయతీ ఎన్నికల తర్వాత గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని.. జీవించే హక్కును కాలరాస్తున్నారని మాజీమంత్రి ఆనంద బాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులో ప్రత్యర్థుల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త కృష్ణను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జీవీ ఆంజనేయులుతో కలిసి పరామర్శించారు.
'తెదేపా కార్యకర్తలపై దాడులు సర్వసాధారణమయ్యాయి'
వైకాపా పాలనలో... గ్రామాల్లో తెదేపా కార్యకర్తలపై దాడులు సర్వసాధారణమయ్యాయని మాజీమంత్రి ఆనంద బాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో ప్రత్యర్థుల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తను ఆనందబాబు పరామర్శించారు.
' వైకాపా పాలనలో... తెదేపా కార్యకర్తలపై దాడులు సర్వసాధారణమయ్యాయి'
అధికార దుర్వినియోగంతో పంచాయతీ ఎన్నికలను వైకాపా నాయకులు ప్రభావితం చేశారని ఆనందబాబు విమర్శించారు. వైకాపా పాలనలో గ్రామాల్లో తెదేపా కార్యకర్తలపై దాడులు సర్వసాధారణమయ్యాయని... ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారని ఆరోపించారు. బాధితులకు తెదేపా పూర్తిగా అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడవద్దని నేతలు భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి