గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలో ఉన్న మర్ఖజ్ మసీద్‌కు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ లక్ష రూపాయలు విరాళం అందించారు. పట్టణ తెదేపా మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖుద్దుస్ ద్వారా ముస్లిం మత పెద్దకు ఈ మొత్తాన్ని అందజేశారు. 2009 నుంచి ఏటా రంజాన్ పర్వదినాన విరాళం ఇవ్వటం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయవల్ల.. కరోనా మహమ్మారి అంతం కావాలని వేడుకుంటున్నట్లు ఆలపాటి వివరించారు.
మసీద్‌కు ఆలపాటి రాజేంద్ర లక్ష రూపాయల విరాళం - Former Minister allapati Rajendra Prasad news
మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మర్ఖజ్ మసీద్‌కు లక్ష రూపాయలు విరాళం అందించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఇస్లాంపేటలో ఉన్న మసీద్‌కు రంజాన్ సందర్భంగా విరాళం అందించటం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.
![మసీద్‌కు ఆలపాటి రాజేంద్ర లక్ష రూపాయల విరాళం donation to masjid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:43:11:1620994391-ap-gnt-36-14-ex-minister-donated-rs1-lakh-to-the-masjid-avb-ap10208-14052021173118-1405f-1620993678-1016.jpg)
విరాళం అందిస్తున్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్