కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్డౌన్ కారణంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోటలోని జొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. పంటలకు ప్రభుత్వం నామమాత్రపు మద్దతు ధర ఇచ్చి.. కంటితుడుపు చర్యలు చేపడుతోందని విమర్శించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులందరి వద్ద పంట కొనుగోలు చేయాలని సూచించారు.
'కంటితుడుపు చర్యలు మాని రైతులను ఆదుకోండి' - అత్తోటలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ వార్తలు
లాక్డౌన్తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని.. మద్దతు ధర లాంటి కంటితుడుపు చర్యలు కాకుండా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.
జొన్న కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్