ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడెల శివప్రసాద్ రావు ద్వితీయ వర్ధంతి..తెదేపా నేతల నివాళులు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట తెదేపా కార్యాలయంలో మాజీ మంత్రి, నవ్యాంధ్ర తొలి సభాపతి దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు ద్వితీయ వర్ధంతిని నిర్వహించారు. కోడెల చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరహే కోడెల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామంలో తొలి శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం కోడెల తనయుడు కోడెల శివరాం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.

కోడెలశివప్రసాద్ రావు ద్వితీయ వర్థంతి
కోడెలశివప్రసాద్ రావు ద్వితీయ వర్థంతి

By

Published : Sep 16, 2021, 3:48 PM IST

Updated : Sep 16, 2021, 9:45 PM IST

నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి డాక్టర్​ కోడెల శివప్రసాదరావు ద్వితీయ వర్ధంతి వేడుకలు చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జంగా వినాయకరావు ఆధ్వర్యంలో పేదలకు పులిహోర పంపిణీ చేశారు.

కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ బాబు, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తానా, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నజీరున్నిసా బేగం, మాజీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి జరుగుమల్లి చెన్నయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్​లు మాట్లాడుతూ కోడెల లేని లోటు పార్టీకి తీరనిదన్నారు.

గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో...

మూడున్నర దశబ్దాల రాజకీయ జీవితంలో పల్నాటి ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన గొప్ప వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అని తెదేపా గుంటూరు పశ్చిమ సమన్వయకర్త కోవెలమూడి రవీంద్ర అన్నారు. గుంటూరు తెదేపా జిల్లా పార్టీ కార్యాలయంలో కోడెల శివప్రసాదరావు ద్వితీయ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి తెదేపా నాయకులు నివాళులర్పించారు.

నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామంలో కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం కోడెల తనయుడు కోడెల శివరాం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెదేపా మాజీ మంత్రులు అయ్యన్నపాత్రులు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జీవి ఆంజనేయులు, తదితర మంత్రులు, మాజీ ఎమ్మెల్యే లు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాం: సజ్జల

Last Updated : Sep 16, 2021, 9:45 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details