రాష్ట్ర ప్రభుత్వం దళితులపై దాడులు చేసేందుకు దళితులనే ఉసిగొల్పుతుందని మాజీ జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ గుంటూరులో ఆరోపించారు. కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోలీసు వ్యవస్థను చేతిలో ఉంచుకోవటం దారుణమన్నారు. వారికి అనుకూలంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెలగపూడి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి.... మరియమ్మ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు.
'వెలగపూడి ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలి' - guntur latest news
వెలగపూడి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి.... మరియమ్మ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ జూనియర్ సివిల్ జడ్డి రామకృష్ణ కోరారు.
!['వెలగపూడి ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలి' former Judge Ramakrishna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10082135-704-10082135-1609498672754.jpg)
మాజీ జూనియర్ సివిల్ జడ్డి రామకృష్ణ
రాష్ట్రంలో ఎటు చూసిన దళితులపై దాడులు జరుగుతున్నాయని.... దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీ సురేష్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరియమ్మ కుటుంబానికి ఇంత వరకు న్యాయం చేయలేదని అన్నారు. ఘటనకు సంబంధించి ఎవ్వరిని అరెస్ట్ చేయలేదని, పరిహారం అందిస్తే న్యాయం జరిగినట్లేనా అని ప్రశ్నించారు. తక్షణమే దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి కారకులైన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: