ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా పాలనలో ఆలయాలకు, విగ్రహాలకు రక్షణ లేదు - బ్రహ్మణులపై దాడులు తాజా వార్తలు

వైకాపా పాలనలో బ్రాహ్మణులపై దాడులు పెరుగుతున్నాయని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య అన్నారు. రాష్ట్రంలో ఆలయాలకు, విగ్రహాలకూ రక్షణ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా నాయకుల చేతిలో దాడికి గురైన కొల్లిమర్ల చంద్రమోహన్​ను ఆయన పరామర్శించారు.

former brahmin corporation chairamn fire on ycp
బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య

By

Published : Jan 3, 2021, 7:13 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా నాయకుల చేతిలో దాడికి గురైన కొల్లిమర్ల చంద్రమోహన్​ను.. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య పరామర్శించారు. వైకాపా ప్రభుత్వంలో పేద బ్రాహ్మణులకు, ఆలయాలకు విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణులపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నాయిని ఆయన మండిపడ్డారు. బ్రాహ్మణుల ఆస్తులు కబ్జా చేయడంతో పాటు.. బ్రాహ్మణులపై భౌతిక దాడులకు దిగడం బాధాకరమని అన్నారు.

చంద్రమోహన్​పై దాడిని బ్రాహ్మణ సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని తెలిపారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే బాధితుడితో బ్రాహ్మణులు అందరూ కలిసి తమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చంద్రమోహన్​పై దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:రామతీర్థాన్ని రణరంగంగా మార్చిన నాలుగు పార్టీలు: మస్తాన్​వలి

ABOUT THE AUTHOR

...view details