ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిరుద్యోగులకు తీపి కబురు.. అటవీ శాఖలో త్వరలో 2 వేల పోస్టుల భర్తీ' - latest forest department news

నిరుద్యోగులకు రాష్ట్ర అటవీశాఖ శుభవార్త చెప్పనుంది. రెండు వేల పోస్టుల భర్తీ కోసం జనవరిలో ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎన్.ప్రతీప్ కుమార్ తెలిపారు.

forest department vacancies will be recruite in january
అటవీశాఖ తీపి కబురు...త్వరలో 2వేల పోస్టుల భర్తీకి ప్రకటన

By

Published : Dec 28, 2019, 5:14 AM IST

ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్​మెంట్ పథకం కింద రాష్ట్రంలోని తీర ప్రాంతంలో మడ అడవులను రూ.78కోట్లతో అభివృద్ధి చేస్తామని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎన్.ప్రతీప్ కుమార్ తెలిపారు. కేరళ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ కేశవన్​తో కలిసి గుంటూరు జిల్లా సూర్యలంకలో ఆయన శుక్రవారం పర్యటించారు. అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎకో టూరిజం ప్రాజెక్టును పరిశీలించారు. సూర్యలంక తీరాన్ని సందర్శించారు. అటవీ శాఖలో రెండు వేల పోస్టుల భర్తీ కోసం జనవరిలో ప్రకటన విడుదలవుతుందని వెల్లడించారు. ఇప్పటికే 540 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్లు వివరించారు. సూర్యలంక ఎకో టూరిజం ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details