గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని విదేశీ విద్యార్థుల బృందం సందర్శించింది. వీరిలో ఫిజీ, గయాన, మారిషస్, మయన్మార్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాన్ అండ్ టుబాగో, సురినామా దేశాలకు చెందిన 40మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఆయా దేశాల్లో ఉండే భారతీయ మూలాలు గల యువతే. భారత్ సందర్శనలో భాగంగా యూనివర్శిటీకి వచ్చారు. యూనివర్శిటి రిజిస్ట్రార్ విద్యార్థులకు స్వాగతం పలికారు. కాసేపు యూనివర్శిటి ఉపకులపతి దామోదరనాయుడుతో భేటీ అయ్యారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధనలు, వ్యవసాయం తీరు తెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలపై ఆరా తీశారు. వీళ్లంతా 25రోజులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారు.
ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులు - latest news for acharya ng ranga agriculture univesity
8 మంది విదేశీయలు గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. యూనివర్శిటిలో జరుగుతున్న పరిశోధనలు, వ్యవసాయం గురించి తెలుసుకున్నారు.
8 దేశాలకు చెందిన విదేశీయులు.. మన దేశంలలో!?