గుంటూరు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేటల్లో శుక్రవారం జిల్లా ఆహారభద్రత అధికారులు పలు నూనె మిల్లులపై ఆకస్మిక దాడులు చేశారు. నూనె మిల్లులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక సోదాలు చేసినట్లు జిల్లా ఆహార భద్రతా అధికారి షేక్ గౌస్ మోహిద్దీన్ తెలిపారు. నూనె నాణ్యతను తెలుసుకోవడానికి పలు నూనె మిల్లుల నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్‌కి పంపిస్తున్నామని ఆయన వివరించారు. ల్యాబ్‌కి పంపిన రిపోర్టులు కల్తీ అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నూనె మిల్లులపై ఆహార భద్రతా అధికారుల దాడులు - food safety departement
గుంటూరు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేటల్లో పలు నూనె మిల్లులపై జిల్లా ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేశారు. ఎనిమిది నమూనాలు సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు.
గుంటూరు జిల్లాలో నూనె మిల్లులపై ఆహార భద్రతా అధికారుల దాడులు
TAGGED:
food safety departement