నిల్వ ఆహారం తిని వలస కూలీ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా సిరిపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రభుత్వ అధికారులు తెలిపిన విరవరాల ప్రకారం.. కర్నూలు జిల్లా సులేకేరి ప్రాంతం నుంచి 50 మంది వ్యవసాయ కూలీలు నెల క్రితం మండలంలోని సిరిపురం వచ్చారు. గ్రామ శివారులో గుడారాలు వేసుకుని ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం అయిదుగురు వలస కూలీలు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. డయేరియా వ్యాధి లక్షణాలేమోనని మండల, ఆరోగ్య అధికారులు తొలుత అనుకున్నారు. దీనిపై ఆరా తీయగా గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో మిలిగిన అన్నం, కూరలు తినడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దాసరి తిమ్మయ్య (45) అనే కూలీ శుక్రవారం మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
నిల్వ ఆహారం తిని వలస కూలీ మృతి - గుంటూరు జిల్లా తాజా వార్తలు
నిల్వ ఆహారం తిని 45 ఏళ్ల వలస కూలీ మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా సిరిపురంలో జరిగింది. నాలుగు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో మిగిలిన అన్నం తెచ్చుకుని వలస కూలీలు తిన్నారు. దీంతో 5 గురు అస్వస్థతకు గురి కాగా.. ఒకరు మృతి చెందారు. మగిలిన వారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
![నిల్వ ఆహారం తిని వలస కూలీ మృతి food poison one death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10530026-676-10530026-1612663862019.jpg)
మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కర్నూలు జిల్లా తరలించారు. తిమ్మయ్య ఓ కార్యక్రమంలో మిగిలిన అన్నంతో పాటు కోడి కూర తెచ్చుకొని నిల్వ ఉంచుకొని మరుసటి రోజు ఉదయం తిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పదేళ్ల బాలిక , ఒక మహిళ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వలస కూలీలు నివాసం ఉన్న ప్రాంతంలో అధికారులు బ్లీచింగ్ పొడి చల్లించారు. పాడైన ఆహారం తినకూడదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వలస కూలీలకు ప్రత్యేకంగా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఇదీ చదవండి;విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ