గుంటూరు శివారులోని ఆర్వీఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఉన్న వలస కార్మికులకు.. మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ లక్ష్మణరెడ్డి... ఆహారం, పండ్లు పంపిణీ చేశారు. బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ్ బంగ, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు 600 మందికి వాటిని అందజేశారు. వలస కార్మికులను ఆదుకునేందుకు.. ప్రభుత్వంతో పాటు, దాతలు, స్వచ్చంద సంస్థలు, ప్రజలు ముందుకు రావటం మంచి పరిణామమని లక్ష్మణరెడ్డి అన్నారు.
వలస కార్మికులకు ఆహారం పంపిణీ - గుంటూరులో వలస కార్మికులకు ఆహారం పంపిణీ
లాక్ డౌన్ కారణంగా పనులు కోల్పోయి రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల వలస కార్మికులను ఆదుకునేందుకు దాతలు ముందుకువస్తున్నారు. వారికి ఆహారం, పండ్లు పంపిణీ చేస్తూ దాతృత్వం చాటుతున్నారు.
![వలస కార్మికులకు ఆహారం పంపిణీ food distribute to migrant labours in guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7276978-515-7276978-1589974201411.jpg)
వలస కార్మికులకు ఆహారం పంపిణీ