ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాత్రిళ్లు ఒకేచోట ఆహారం.. గుంటూరులో ఫుడ్‌కోర్టులు ప్రారంభం - FOOD COURTS nights in guntur latest news

గుంటూరు నగరంలో నూతనంగా ఫుడ్‌కోర్టుల ఏర్పాటు చేశారు. రాత్రి పూట అల్పాహారం దొరికేలా పోలీసుల వినూత్న చర్యలు చేపట్టారు. వ్యాపారులతో చర్చించి ఒకేచోట ఫుడ్‌కోర్టులు పెట్టించారు. వీటి పనితీరు బాగుంటే మరోచోట పెట్టడాన్ని పరిశీలిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఫుడ్‌కోర్టుల తీరుపై నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

food-courts-in-guntur

By

Published : Nov 20, 2019, 10:47 AM IST

Updated : Nov 20, 2019, 12:41 PM IST

గుంటూరులో ఒకేచోట ఫుడ్‌కోర్టలు ప్రారంభం

గుంటూరులో రాత్రి 11 గంటలు దాటిందంటే ఆహార పదార్థాలు దొరకక అవస్థలు పడుతున్న నగరవాసులకు... కాస్త ఊరట లభించేలా పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. రాత్రి ఒంటి గంట దాటినా భోజనం లభించేలా ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేయించారు. గతంలో చిరు వ్యాపారులు చిన్న బండ్లు, స్కూటీలపైన అల్పాహారాన్ని రోడ్డు ప్రక్కన విక్రయించేవారు. దీనివల్ల ట్రాఫిక్‌కు కలుగుతోందని భావించిన ఎస్పీ... వ్యాపారులందరితో చర్చించి ఒకేచోట ఫుడ్ కోర్టులను ప్రారంభించారు. వీటి పని తీరు బాగుంటే మరోచోట ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రెండురోజుల క్రితం హిందూ కళాశాల కూడలి వద్ద ప్రారంభమైన ఫుడ్‌కోర్టులకు స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Last Updated : Nov 20, 2019, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details