ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న వరదనీరు - పులిచంతల జలాశయంలో వరద నీరు

పులిచింతల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 8 గేట్లు ఎత్తి లక్షా 53వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

flood water in pulichinthala project
పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న వరదనీరు

By

Published : Aug 27, 2020, 1:44 PM IST

పులిచింతల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం 8 గేట్లు ఎత్తి లక్షా 53వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 15 వేల క్యూసెక్కులు కేటాయించారు. ప్రస్తుతం ఎగువ నుంచి 2లక్షల 25వేల క్యూసెక్కుల వరద వస్తోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.64 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

వరద నీటికి తగ్గట్లుగా మరిన్ని గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నాగార్జున సాగర్ నుంచి భారీగా వరదనీరు వస్తున్న తరుణంలో అధికారులు ప్రాజెక్టు వద్దే ఉండే పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details