ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులిచింతల ప్రాజెక్టుకు కొంతమేర తగ్గిన వరద - పులిచింతలకు వరద నీరు న్యూస్

పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద కొంతమేర తగ్గింది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టుకు 3 లక్షల 55 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.

పులిచింతల ప్రాజెక్టుకు కొంతమేర తగ్గిన వరద
పులిచింతల ప్రాజెక్టుకు కొంతమేర తగ్గిన వరద

By

Published : Oct 21, 2020, 1:32 PM IST

పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన 13 గేట్లు ఎత్తి 3లక్షల 47వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం 8వేల క్యూసెక్కులు కేటాయించారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 44.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇవాళ సాయంత్రానికి వరద ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. పులిచింతల నుంచి ప్రవాహాలు తగ్గటంతో ప్రకాశం బ్యారేజికి కూడా వరద తగ్గింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజికి పులిచింతలతో పాటు.. కృష్ణా జిల్లాలోని వాగుల నుంచి వచ్చే వరదతో కలిపి 4లక్షల 3వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే వరద తగ్గిన నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు.

ABOUT THE AUTHOR

...view details