పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు పెరుగుతోంది. ప్రస్తుతం ఎగువ నుంచి 2లక్షల 45వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 8గేట్లు ఎత్తి 2లక్షల 33వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం 12వేల క్యూసెక్కులు కేటాయించారు.
పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి... 8గేట్లు ఎత్తి నీరు విడుదల - flood to pulichinthala project
పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 8గేట్లు ఎత్తి 2లక్షల 33వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి
పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 44.64 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద తీవ్రతను బట్టి మరికొన్ని గేట్లు ఎత్తటం లేదా దించటం చేస్తామని అధికారులు తెలిపారు. పులిచింతల దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి: చలో మదనపల్లె: తిరుపతిలో ఉద్రిక్తత.. ఎస్సీ సంఘాల నేతల అరెస్టు