గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద భారీగా పెరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న శ్రీశైలం, సాగర్ నుంచి వరద ఎక్కువగా వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత పది రోజులుగా ఎగువ నుంచి వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. అత్యధికంగా 6.5లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చింది.
పులిచింతల ప్రాజెక్టుకు పెరగనున్న వరద - పులిచింతలకు వరద
గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోగా పై ప్రాంతం నుంచి 2.5లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అనుకుంటున్నారు. ప్రాజెక్టు 4గేట్లు ఎత్తి 83వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు.
ఇవాళ సాయంత్రంలోగా పై ప్రాంతం నుంచి 2.5లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలకు ఇన్ ఫ్లో లక్షా 17వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు 4గేట్లు ఎత్తి 83వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 12వేల క్యూసెక్కులు కేటాయించారు. పులిచింతల పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... జలాశయంలో ప్రస్తుతం 45.20 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఈనాడు కథల పోటీకి ఆహ్వానం