పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నించి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ నుంచి 5 లక్షల 86వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు. 5 లక్షల 67 వేల క్యూసెక్కుల నీరు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వెళ్తోంది.
అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం 10వేల క్యూసెక్కులు విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 42.47 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి వరద నిలకడగా కొనసాగుతున్నా... రాత్రికి కొంత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.