పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉదయం కొంతమేర తగ్గినా.. మళ్లీ సాయంత్రానికి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో లక్షా 39,000 క్యూసెక్కులుగా ఉంది. ఫలితంగా జలాశయం 5 గేట్లను ఎత్తి లక్షా 41,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం 45.30 టీఎంసీల నిల్వ..
ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుత 45.30 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కోసం సుమారు 12 వేల క్యూసెక్కులను కేటాయించారు. ఎగువ నుంచి వరద పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తనున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : కృష్ణా నదిలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి