అధిక వర్షాలు, వరదల నేపథ్యంలో...గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నదీ పరివాహక ప్రాంతంలో వరద ఉద్ధృతిని పరిశీలించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు జిల్లా కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజల కోసం కంట్రోల్ రూమును ఏర్పాటు చేసినట్టు జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. కంట్రోల్ రూం 0863-23244014, 0863- 2234014 నెంబరుకు సంప్రదించవచ్చని సూచించారు.
తీరప్రాంతం అప్రమత్తం..! - Flood Control Room in guntur
కృష్ణానది నుంచి వరద నీటి విడుదల నేపథ్యంలో.... గుంటూరు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తీర ప్రాంతాలలో ఉన్న మండలాలు, గ్రామాల అధికారులను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. వరద నీటి ఉద్ధృతిని పరిశీలించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది.
గుంటూరు జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు