పులిచింతల జలశయానికి వస్తున్న వరద మేరకు ప్రాజెక్టు 17గేట్లు ఎత్తి 4లక్షల 68వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 8వే క్యూసెక్కులు కేటాయించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 43.84 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదలో కొంతమేర పెరుగుదల ఉండటంతో అందుకు తగ్గట్లుగా మరికొన్ని గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
పులిచింతల జలాశయానికి కొనసాగుతున్న వరద - పులిచింతల ప్రాజెక్టు వరద నీరు వార్తలు
పులిచింతల జలాశయానికి ఎగువ నుంచి వరద నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం 4లక్షల 89 వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పులిచింతల జలాశయానికి కొనసాగుతున్న వరద