ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలిలో ఫ్లెక్సీ వివాదం - Flexi friction in Tenali

గుంటూరు జిల్లా తెనాలిలో ఓ ఫ్లెక్సీ వివాదస్పదమైంది. మార్కెట్ సెంటర్లో అన్నా క్యాంటీన్​కు జై అమరావతి ఫ్లెక్సీలను తెదేపా కార్యకర్తలు ఏర్పాటు చేశారు. కొద్దికాలంగా అదే చోట వైకాపా ఫ్లెక్సీలు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు జై అమరావతి ఫ్లెక్సీలను తొలగించి... వైకాపా ఫ్లెక్సీలను ఉంచారు. అది తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు అక్కడి చేరుకుని ధర్నా చేశారు. రెండు నెలలుగా కట్టిన ఫ్లెక్సీలు తీయకుండా.... ఇప్పుడు కట్టిన ఫ్లెక్సీలను ఎందుకు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేని ఫ్లెక్సీలు తొలగించేలా ... మున్సిపల్ కమిషనర్ నుంచి ఆదేశాలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడం వల్ల వివాదం సద్దుమణిగింది.

Flexi friction in Tenali
తెదేపా కార్యకర్తల ధర్నా

By

Published : Jan 25, 2020, 7:43 AM IST

ఫ్లెక్సీ తొలగించడంపై తెదేపా కార్యకర్తల ఆందోళన

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details