ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారుమంచిలో ఉద్రిక్తత.. ఎన్టీఆర్‌ విగ్రహానికి వైకాపా జెండా - ఏపీ వార్తలు

Flexi Dispute: గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుర్తుతెలియని దుండగులు జెండా చెట్టు కూడలిలోనున్న తెలుగుదేశం బ్యానర్లు చించేసి.. ఎన్టీఆర్‌ విగ్రహానికి వైకాపా జెండాలు కట్టారు. దీంతో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. గతంలో సైతం ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Flexi Dispute
Flexi Dispute

By

Published : Feb 13, 2022, 11:31 AM IST

Flexi Dispute: గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది దుండగులు జెండా చెట్టు కూడలిలోనున్న తెలుగుదేశం బ్యానర్లు చించేసి.. ఎన్టీఆర్‌ విగ్రహానికి వైకాపా జెండా కట్టడంతో.. తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా.. పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ చర్యలకు కారణం వైకాపా వర్గీయులే అంటూ నినదిస్తూ.. నిరసన చేశారు.

పోలీసులు తెలుగుదేశం శ్రేణులతో మాట్లాడినా వారు పట్టువీడలేదు. చివరకు పోలీసుల జాగీలాలను తెప్పించి విచారణ జరిపారు. అయినా నిందితులను కనిపెట్టలేదు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:Insulting judges Case: జడ్జిలను దూషించిన కేసులో ఏపీ అసెంబ్లీ స్టాండింగ్‌ కౌన్సెల్‌ చంద్రశేఖర్‌ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details