గుంటూరు రూరల్ మండలం బుడంపాడు గ్రామానికి చెందిన శేషం శ్రీనివాసరావు... బ్రాడిపేటలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే బ్రాంచ్‌లో తనతో పనిచేస్తున్న జండాచెట్టు ప్రాంతానికి చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెతో నమ్మకంగా ఉంటూ వారి కుటుంబసభ్యుల వివరాలను తెలుసుకున్నాడు. వారు బాగా డబ్బు ఉన్నవారని గ్రహించి.. మహిళ తాత పేరు మీద ఖాతా తెరిపించాడు. బ్యాంకు ఖాతాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. అధిక మొత్తంలో వడ్డీ, అసలు వస్తాయని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాధితుడు విడతల వారీగా నగదు ఇచ్చాడు.
Fraud: ఫిక్స్‌డ్ డిపాజిట్ పేరుతో మోసం..రూ.60 లక్షలు స్వాహా - ఫిక్స్‌డ్ డిపాజిట్ పేరుతో మోసం
21:26 August 17
ఫిక్స్‌డ్ డిపాజిట్ పేరుతో మోసం
ఈ క్రమంలో శ్రీనివాసరావు... బ్యాంకులో నగదు జమ చేసినట్లు ఏడు నకిలీ బాండ్ పేపర్లను బాధితులకు ఇచ్చాడు. బాదితుడికి తెలియకుండా వారి ఖాతా నుంచి నగదును ఉపసంహరించుకున్నాడు. అంతే కాకుండా తనకు డబ్బులు అవసరం ఉన్నాయని, వారంలో తిరిగి ఇచ్చేస్తానని బాధితురాలి నుంచి బంగారం తీసుకున్నాడు. ఈ విధంగా బాధితుల నుంచి రూ.60 లక్షలు నగదు కాజేసి, పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన మహిళ కుటుంబసభ్యులు... జులై 5న నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని మంగళవారం సాయంత్రం మూడుబొమ్మల సెంటర్ వద్ద అరెస్టు చేశారు.
ఇదీ చదవండి
CM Review: కర్ఫ్యూలో సడలింపులు.. వివాహానికి 150 మందికే అనుమతి..!