ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GIRL ON VENTILATOR: వెంటిలేటర్​పై ఐదేళ్ల చిన్నారి..ఏమైందో తెలియక తల్లిదండ్రుల ఆందోళన - గుంటూరు జిల్లా తాజా వార్తలు

GIRL ON VENTILATOR: ఐదేళ్ల ఆ పాపకు కంటి కింద చిన్న కణితి ఏర్పడింది. చిన్నారి ఎదుగుతున్న కొద్ది అది ఇబ్బందికరంగా మారుతుందని భావించిన తల్లిదండ్రులు.. దానిని తొలగించేందుకు వైద్యులను సంప్రదించారు. చిన్నారికి చికిత్స చేసి కణితి తొలగిస్తామని వైద్యులు చెప్పగా... ఆస్పత్రిలో చేర్పించారు. ఆడుతూ పాడుతూ ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారి.. రెండు రోజుల నుంచి వెంటిలేటర్​పై చికిత్స పొందుతోంది. కుమార్తెకు ఏమైందో కూడా తెలియడం లేదని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే?

GIRL ON VENTILATOR
విలపిస్తున్న చిన్నారి తల్లిదండ్రులు

By

Published : May 9, 2022, 1:17 PM IST

GIRL ON VENTILATOR: వైద్యుల నిర్లక్ష్యంతో తమ కుమార్తెను విగతజీవిగా మార్చారని ఆరోపిస్తూ.. గుంటూరు జీజీహెచ్‌ వద్ద తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నగర శివారు అంకిరెడ్డిపాలానికి చెందిన ఏడుకొండలు, పావని దంపతుల కుమార్తె ఆరాధ్య. ఐదేళ్ల పాపకు కంటి కింద చిన్న కణితి ఏర్పడింది. చిన్నారి ఎదుగుతున్న కొద్ది కణితి ఇబ్బందికరంగా మారుతుందని భావించిన తల్లిదండ్రులు... దానిని తొలగించేందుకు జీజీహెచ్‌ వైద్యులను సంప్రదించారు. శనివారం చిన్నారికి చికిత్స చేసి.. కణితి తొలగిస్తామని వైద్యులు చెప్పగా... ఆస్పత్రిలో చేర్పించారు. ఆపరేషన్‌కి తీసుకెళ్లేప్పుడు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి... చికిత్స సమయంలో పరిస్థితి విషమంగా ఉందని వెంటిలేటర్‌పై పెట్టినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమార్తెకు ఏమైందో కూడా వైద్యులు సరిగా చెప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details