Five teachers suspended in Tenali: అది ఒక్క ప్రభుత్వ పాఠశాల.. అక్కడ పిల్లలకు మాత్రమే ఆటలు ఆడుకోవడం.. వ్యాయామం చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే ఓ ప్రజా ప్రతినిధి ఆ స్కూల్‌ను తన జిమ్‌గా మార్చుకున్నాడు. మరొకరూ, పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్.. ఈయన రోజు పాఠశాలలో తిష్ట వేసి పాఠశాల కొనసాగుతున్న సమయాల్లో అక్కడే ఉంటున్నారు. ఇదే అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలోని ఉపాధ్యాయులను పలుమార్లు ప్రశ్నించారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంతా కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ పిల్లలు పాఠశాలలో పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలంటూ రోడ్డు మీద బైఠాయించి నరసన తెలిపారు. విషయం తెలుసుకున్న డీఈఓ శైలజ విచారణ చేపట్టి ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే స్కూల్లో ఇతరులు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు గుర్తించారు. అందుకు బాధ్యులైన ఐదుగురు ఉపాధ్యాయులను విధులనుంచి తొలగించి, మరో ఇద్దరిని వేరే ప్రాంతానికి బదిలీ చేసిన ఘటన తెనాలి పట్టణంలో చోటు చేసుకుంది.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఉపాధ్యాయులపై డీఈఓ శైలజ సస్పెండ్ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతానగర్లో ఎన్ఎస్ఎఫ్ పురపాలక ఉన్నత పాఠశాలలో ఇటీవల విద్యార్థులు వారి తల్లితండ్రులు తమ సమస్యలు పరిష్కరించాలని స్కూల్ కాంపౌండ్‌లో నిరసన చేపట్టారు. ఇదే అంశంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. డీఈవో శైలజ నేతృత్వంలో విచారణ చేపట్టారు. పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్తోపాటూ.. ఆ ప్రాంత కౌన్సిలర్ పాఠశాల నిర్వహణ విషయంలో మితిమీరిన జోకింగ్ చేసుకుంటున్నారని విద్యాశాఖ అధికారుల పరిశీలనలో వెల్లడైంది.