గుంటూరులోని మిర్చియార్డుకు ఈనెల 21 నుంచి వరుసగా 5 రోజులపాటు అధికారులు సెలవులు ప్రకటించారు. రేపు మాత్రమే యార్డులో కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. 21న శ్రీరామనవమి, 24, 25 తేదీల్లో శని, ఆదివారాలు కాబట్టి సాధారణంగానే సెలవు ఉంటుందన్నారు. వీటికి అదనంగా 22, 23న సెలవు ఇవ్వాలని తీర్మానించినట్లు యార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. సరకు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొద్ది రోజులు కార్యకలాపాలు ఆపితే మిర్చికి కొంత ధర పెరిగి రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:ఫార్మా సంస్థలు, ప్రముఖ వైద్యులతో మోదీ భేటీ
"ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2లక్షల టిక్కీలకుపైగా సరకు మార్కెట్కు వచ్చింది. గత వారం వచ్చిన మిర్చిలో.. లక్షన్నర టిక్కీలు మిగిలిపోయాయి. మొత్తం మూడున్నర లక్షల టిక్కీల సరుకు యార్డులో పేరుకుపోయింది. ఎటుచూసినా మిర్చిబస్తాలే కనిపిస్తున్నాయి. వాహనాలు ముందుకు కదల్లేక నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. యార్డుకు సరకు ఎక్కువగా వస్తుండటంతో మిర్చి ధరల్లో తగ్గుదల కనిపించింది. దీంతో రైతులు నష్టపోయే అవకాశం ఏర్పడింది. అందుకే యార్డులో సరకు అమ్మకాలు పూర్తయ్యాక.. మళ్లీ అనుమతించాలని నిర్ణయించాం" - ఏసురత్నం, మార్కెట్ యార్డు ఛైర్మన్
ఇదీ చదవండి:
వైరస్ విస్తరిస్తున్నా... మాస్కును మరుస్తున్నారు!