బల్లవల ద్వారా వేట చేయటాన్ని నిషేధించాలని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందని మత్స్యకారులు కోరుతున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావును గుంటూరులోని రోడ్లు భవనాలశాఖ అతిథిగృహంలో మత్స్యకారులు కలిశారు. తమ సమస్యలను మోపిదేవికి వివరించారు. అన్ని ప్రాంతాల్లోనూ బల్లవల వేటను నిషేధించినప్పటికీ కొంతమంది ఇంకా ఆ వేటను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనివలన సముద్రంలో చేపల ఉత్పత్తి ఉండదని, తద్వారా మత్స్యకారులు వేటకు వెళ్తే చేపలు దొరికే పరిస్థితి ఉండదన్నారు. దీనిపై మోపిదేవి స్పందిస్తూ.. పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. మత్స్యకారులంతా కలిసికట్టుగా ఉండాలని, ఎలాంటి వివాదాలను పెట్టుకోవద్దని, ఏవైనా సమస్యలుంటే యూనియన్, లేదా తన దృష్టికి తీసుకునిరావాలని వారికి సూచించారు.
మోపిదేవిని కలిసిన మత్స్యకారులు.. బల్లవల వేట నిషేధించాలని వినతి - బల్లవల వేట తాజా వార్తలు
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావును గుంటూరులోని రోడ్లు భవనాలశాఖ అతిథిగృహంలో మత్స్యకారులు కలిశారు. బల్లవల ద్వారా వేట చేయటాన్ని నిషేదించాలని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందని మత్స్యకారులు ఆయనను కోరారు. విషయాన్ని పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని మోపిదేవి మత్స్యకారులకు హమీ ఇచ్చారు.
మోపిదేవిని కలిసిన మత్స్యకారులు