ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిషేధ సమయం ముగిసినా... కష్టాలు తప్పడంలేదు - బాపట్ల

వేట నిషేధ సమయం ముగిసినా... మత్స్యకారులకు కష్టాలు తప్పడంలేదు. గుంటూరు జిల్లా బాపట్ల తీర ప్రాంతంలోని గ్రామాల మత్స్యకారులు బోట్లు నిలిపే వెదుళ్ళపల్లి డ్రైన్ నుంచి... సముద్రంలోకి బోట్లు తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మత్స్యకారులు

By

Published : Jun 14, 2019, 11:53 PM IST

మత్స్యకారులు

గుంటూరు జిల్లాలో 43కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం 10వేల నుంచి 12 వేల మంది మత్స్యకారులు... చేపలవేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. సముద్రంలో చేపల వేట నిషేధం ఏప్రిల్‌ 15నుంచి జూన్‌14 వరకు 61రోజులపాటు అమల్లో ఉన్నాయి. చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో... తల్లి చేపలను కాపాడటం, పెరుగుదలను ప్రోత్సహించటం ద్వారా మత్స్యసంపద సుస్థిరం చేయటం దీని ముఖ్యఉద్దేశం. అయితే బోట్లు నిలిపే డ్రైన్ నుంచి సముద్రంలోకి వెళ్లే ప్రాంతంలో... ఇసుక మేటలు వేయటంతో బోట్లు అన్ని డ్రైన్​లోనే నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించి ఇసుక మేటలు తొలగించాలని... సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు వీలు కల్పించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details