ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రకటనపై మత్స్యకారులు హర్షం

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వీటిల్లో గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్​ కూడా ఒకటి. నిజాంపట్నం హార్బర్ ప్రకటనతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హార్బర్ విస్తరణ పనులు చేపడితే సరకు రవాణా సమస్యలు పరిష్కారం అవుతాయని మత్స్యకారులు అంటున్నారు.

fishermen-expresses-happy-after-announcing-nizampatnam-harbor
fishermen-expresses-happy-after-announcing-nizampatnam-harbor

By

Published : Nov 22, 2020, 2:53 AM IST

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణాల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ ఉండటంతో ఆ ప్రాంత మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.451 కోట్లతో నిజాంపట్నం హార్బర్​ను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న జెట్టి విస్తరించటంతో పాటు శీతల గిడ్డంగులు, ఆక్షన్ రూములు ఏర్పాటు చేయనున్నారు.

నిజాంపట్నం హార్బర్​లో సుమారు 200 పెద్ద బోట్లు, 500 ఫైబర్ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 15 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నారు. జెట్టి వద్ద బోట్లు నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉండటంతో సరకు దింపుకునే సమయంలో ఇబ్బందిగా ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. విస్తరణ పనులు జరిగితే ఆ సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. నూతన నిర్మాణాల వల్ల మరికొంత మందికి ఉపాధి కలుగుతుందని గంగపుత్రులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ చదవండి :తిరుమలలో వైభవంగా పుష్పయాగం

ABOUT THE AUTHOR

...view details