లాక్డౌన్తో గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరంలోని గంగపుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సముద్రాన్ని నమ్ముకుని బతికే వీరంతా... ఇప్పుడు ఉపాధి లేక విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం అరకొరగా ఉండటంతో కుటుంబ పోషణ భారమై అల్లాడిపోతున్నారు. సముద్రపు అలల ద్వారా కొట్టుకొచ్చే చిల్లర నాణేల కోసం గంగపుత్రుల కుటుంబసభ్యులు తీరాన వెతుకులాడుతున్నారు. దొరికిన చిల్లరతో కొద్దిపాటి అవసరాలు తీర్చుకుంటున్నామని అంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు తమ దీనస్థితిపై స్పందించాలని గంగపుత్రులు వేడుకుంటున్నారు.
చిల్లర కోసం... సముద్ర తీరాన గంగపుత్రుల వెతుకులాట
మత్స్యకారులు లాక్డౌన్ కారణంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేకపోవటంతో కుటుంబ పోషణ కష్టంగా మారి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రభుత్వం సాయం సరిపోక పస్తులుంటున్నారు. అలల నుంచి కొట్టుకువచ్చే చిల్లర కోసం వేట సాగిస్తున్నారు.
fisherman